
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నాగర్‌కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదని, వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో లీడ్ ఫైర్‌మెన్లు వహీదుద్దీన్, రంగస్వామి, ఫైర్‌మెన్లు మల్లేష్, శంకర్, వెంకటేశ్వరరావు, సిబ్బంది సైఫ్, శ్రీనివాసులు, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.