
వచ్చే ఏడాది నుంచి..
ప్రతి సంవత్సరం తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం చిన్నది కావడంతో తాగునీటి సరఫరాపై ఆందోళనలు నెలకొంటున్నాయి. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగితే తాగునీటి ఇక్కట్లు పూర్తిస్థాయిలో తీరుతాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6 టీఎంసీల పైనే. ఒక్కసారి రిజర్వాయర్ నిండుగా ఉంచితే వేసవి మొత్తం మిషన్ భగీరథకు తాగునీరు అందుతుంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకానికి నీటిని మళ్లించేందుకు వీలుగా రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి.