
గరుడ వాహనంపై ఊరేగిన రామయ్య
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున స్వామివారికి గరుడ వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. అంతకుముందు ఆలయంలో సీతారామచంద్రస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అదే విధంగా శివదత్తాత్రేయ, పరశురామ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల తరలివచ్చిన భ క్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, మురళీదర్ శర్మ, సీతారామశర్మ, కోదండరామశర్మ, రఘుశర్మ, ప్రవీణ్‌శర్మ, అనంతరామశర్మ, భాస్కరశర్మ పాల్గొన్నారు.
స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తున్న భక్తులు