విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో మొదటి విడతలో ఎంపికై న పీఎంశ్రీ పాఠశాలలకు పది డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఒక ప్రింటర్, 2 కేవీ ఇన్వర్టర్ల చొప్పున జిల్లావ్యాప్తంగా 27 పాఠశాలలకు అందించారు. పీఎంశ్రీ పథకం కింద మొదటి దఫాలో ఎంపికై న ఉన్నత పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలులోకి వచ్చింది. ప్రతి ఎమ్మార్సీకి అందించిన ఎలక్ట్రికల్ నెట్ వర్కింగ్ సిస్టమ్‌తోపాటు డెస్క్‌టాప్, ప్రింటర్లు, యూపీఎస్‌లు, ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ధ్రువీకరించారు. అలాగే ప్రైమరీ స్కూళ్లకు సంబంధించి అవసరాలను బట్టి ఆట వస్తువులు, కంప్యూటర్, ప్రింటర్లు, స్కూళ్ల భద్రత కోసం సీసీ కెమెరాలు, టీవీలు, ఫీల్డ్ విజిట్లు చేశారు.


