విధులకు సకాలంలో హాజరు కావాలి | - | Sakshi
Sakshi News home page

విధులకు సకాలంలో హాజరు కావాలి

Aug 28 2026 1:45 AM | Updated on Aug 28 2026 1:45 AM

ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

ఎస్‌ఎస్‌తాడ్వాయి: వైద్యాధికారులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో సూచించారు. మండల పరిధిలోని కాటాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. రోగుల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. రోగుల సహాయకులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దోమల నివారణకు నివాస ప్రాంతాల్లో ఇండోర్‌ రెసిడ్యువల్‌ స్ప్రేయింగ్‌ (ఐఆర్‌ఎస్‌) చేపడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని నివాస ప్రాంతాల్లో ఐఆర్‌ఎస్‌ కవరేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మందుల నిల్వ గదిని తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పంపిణీ చేసే మందుల వివరాలను స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసిన ఆయన రోగులకు మందులు పంపిణీ చేసే తీరును పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement