వెంకటాపురం(ఎం): జిల్లాకు కేంద్రీయ విద్యాలయం(కేవీ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని బీజేపీ నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భగా బలరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 54 కొత్త కేవీల్లో తెలంగాణకు నాలుగు మంజూరయ్యాయని తెలిపారు. వాటిల్లో ఒకటి జిల్లాకు కేటాయించడం ప్రధాని నరేంద్రమోదీ ఘనత అని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన ప్రధాని మోదీ, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


