ములుగు: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. సోమవారం జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీపోలు రాజు ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌లకు ధర్నా నోటీసు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, హెల్త్ కార్డుల అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వి.యాకూబ్‌రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి కందుల జీవనన్‌కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి మేడి చైతన్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రామ్మూర్తి, సారయ్య, శ్యామ్‌నాయక్, ప్రభాకర్‌రావు, ప్రకాష్‌రెడ్డి, అప్పలనాయుడు, ధర్మానాయక్, డాక్టర్ కొమురయ్య, సిద్ధార్థరెడ్డి, ప్రేమలత, పిట్టల రవి, కుమారస్వామి, ఎండీ రఫీక్, చంద్రశేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


