గిరిజన దర్బార్‌లో.. | - | Sakshi
Sakshi News home page

గిరిజన దర్బార్‌లో..

Aug 25 2026 1:03 AM | Updated on Aug 25 2026 1:03 AM

ఏటూరునాగారం: గిరిజనులు సమర్పించిన వినతులు తక్షణమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఐటీడీఏ సమావేశంలో గిరిజనుల నుంచి 13 వినతులను స్వీకరించారు. గోవిందరావుపేట మండలం గాంధీనగర్‌ గ్రామం అభివృద్ధికి ఎస్‌సీసీఎల్‌ సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి పనులు చేయించాలని సింగరేణి కాలారీస్‌ కంపెనీ లిమిటెడ్‌ కార్మికులు కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామంలో బోరు ఇప్పించాలని గిరిజన రైతు కోరారు. తాడ్వాయి మండలం గంగారం గ్రామంలో అన్నారం శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురవుతుందని, పరిరక్షించాలని కోరారు. అలాగే వివిధ మండలాల నుంచి గిరిజనులు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వచ్చిన సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపుతామని పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ ప్రతాప్‌, డీడీ జనార్దన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, జేడీఎం కొండల్‌రావు, ఈఈ ప్రవీణ, జీసీసీ డీఎం వాణి, ఐటీఐ ప్రిన్సిపాల్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement