వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హైదరాబా ద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు భారత్ దర్శన్‌లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్‌లు తీర్థ ప్రసాదాలు అందించారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, ఎంసీహెచ్‌ఆర్డీ అధికారులు శంకర్, నందకిషోర్, రవి, ఆర్‌ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది, తదితరులు ఉన్నారు.


