చదువుతోనే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే గుర్తింపు

Aug 21 2026 7:15 AM | Updated on Aug 21 2026 7:15 AM

ఏటూరునాగారం: విద్యార్థులకు చదువుతోనే తగిన గుర్తింపు వస్తుందని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బానోత్‌ ధర్మ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ విభాగానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే నిలిపివేయకుండా ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఓపెన్‌ యూనివర్సిటీ విధానం అమలులో ఉందని తెలిపారు. 2026–27 అడ్మిషన్లకు సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు సమయం ఉన్నట్లు తెలిపారు. ఒకేసారి రెండు డిగ్రీలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. విద్యార్థులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి కల్పించేందుకు వైస్‌ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని తెలిపారు. చదువుకోవాలనే లక్ష్యం ఉన్న వారు ఓపెన్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ పొందాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సి పాల్‌ నవీన్‌, అధ్యాపకులు భాస్కర్‌, రమేశ్‌, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, నాగలక్ష్మి పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

డైరెక్టర్‌ ధర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement