● కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు
ములుగు: మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడంతో పాటు వారి సంరక్షణే ధ్యేయమని కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయంలో జిల్లా నిర్భయ ఫండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ నిర్భయ ఫండ్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్(మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు)గా జిల్లా ఎంపికై ందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో మహిళలు, బాలికలు సురక్షితంగా చదువుకోవడానికి, ప్రయాణించడానికి, రోజువారీగా పలు కార్యక్రమాల్లో స్వేచ్ఛగా పాల్గొనడానికి వీలు కల్పించేలా మహిళా–స్నేహపూర్వక పట్టణ ప్రదేశాలను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్నారు. మహిళలు, బాలికలు భద్రత, రవాణా, ప్రజా ప్రదేశాలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి అంశాలకు సంబంధించి ఎదుర్కొనే సవాళ్లను కమిటీ గుర్తిస్తుందని తెలిపారు. మహిళలు, బాలికలకు సురక్షితమైన నగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా స్థానిక సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, పౌర సంఘాలు సమన్వయంతో పనిచేసి మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహిళలు, బా లికల సురక్షిత అవసరాలను గుర్తించి ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేసినట్లు వివరించారు. వీటిని ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వ అనుమతితో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత, డీఎస్పీ కిశోర్‌కుమార్, జిల్లా రవా ణాశాఖ అధికారి ఠాకూర్ ఈశ్వర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, టూరిజం అసిస్టెంట్ మేనేజర్ సూర్య కిరణ్, డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ రమాదేవి, సఖి కేంద్రం సెంటర్ అడ్మిన్ లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ పాల్గొన్నారు.


