● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో నిబద్ధతతో, పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేకూరేలా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసుల్లో ముద్దాయిలను, సాక్షులను తప్పని సరిగా కోర్టుకు హాజరుపర్చాలన్నారు. నేరస్తులకు శిక్షపడేలా కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చూసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్టులపై నిఘా ఉంచాలని సూచించారు. నమోదైన కేసుల వివరాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణపై నిఘా పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మమన్ భట్, డీసీఆర్‌బీ డీఎస్పీ కిశోర్, డీఎస్పీ రవీందర్, సీఐలు సురేశ్, దయాకర్, రమేశ్, ఆర్‌ఐలు స్వామి, వెంకటనారాయణ, శ్రీకాంత్, తిరుపతి, ఎస్సైలు వెంకటేశ్, చల్లా రాజు, తాజుద్దీన్, కమలాకర్, జగదీశ్, మహేశ్, సూరి, వెంకటేశ్, సతీష్, కృష్ణప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు.


