ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

ములుగు రూరల్‌: ప్రపంచ ఫొటోగ్రాపర్స్‌ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో రామప్ప ఫొటో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఫొటోగ్రఫీ పితామహుడు డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రను భద్రపరిచే సాధన కెమెరా అన్నారు. ఒక్కఫొటో వెయ్యి మాటలకు సమానమని తెలిపారు. ఫొటోగ్రఫీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న ఫొటోగ్రాఫర్ల సేవలను కొనియాడారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్‌ కందుల రవీందర్‌, జక్కుల సదానందం, శ్రీనివాస్‌, వెంకట్‌, మాట్ల భద్రి, దేవేందర్‌, రమేశ్‌, రాజు, సంపత్‌, అరవింద్‌, బాబురావు, సునీల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement