ములుగు: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావును తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీఎన్‌జీవోస్)ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం, రాష్ట్ర పంచాయతీరాజ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసినందుకు కలెక్టర్‌కు టీఎన్‌జీవోస్ జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు కలెక్టర్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల జీవన్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ కొమరయ్య, ఉపాధ్యక్షులు కె.శిరీష, విజయభాస్కర్, రాజ్‌కుమార్, యశ్వంత్, జాయింట్ సెక్రెటరీలు రఫిక్, శైలజ, రాజు తదితరులు పాల్గొన్నారు.


