వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని జర్మనీ దేశానికి చెందిన డేనియల్ గ్రాస్, కెవిన్ పౌలుస్ కొనియాడారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆహ్వానం
ములుగు: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి 2026 విద్యా సంవత్సరానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డుకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు తమ దరఖాస్తుతో పాటు పాఠశాలలో చేపట్టిన వినూత్న కార్యక్రమాల వివరాలను జత చేసి రెండు కాపీలను ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు దరఖాస్తులను పరిశీలించి ప్రతీ మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను సిఫారసు చేయాలని పేర్కొన్నారు. ఎంపిక చేసిన వారి పూర్తి దరఖాస్తులను ఈ నెల 29 ఉదయం 11 గంటలోగా డీఈఓ కార్యాలయంలో అప్పగించాలని డీఈఓ పేర్కొన్నారు.
ఓబీసీ ఎగ్జిక్యూటివ్
సభ్యుడిగా బుచ్చయ్య
ఏటూరునాగారం: కన్నాయిగూడెం మండలం గూర్రేవుల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పల్లా బుచ్చయ్యను బీజేపీ రాష్ట్ర ఓబీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం బుచ్చయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ బలోపేతానికి నిరంతరం పాటుపడుతానని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి
ఏటూరునాగారం: కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు రాంనర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గొప్ప ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తీరని లోటన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప ఉద్యమ నాయకుడు పెద్ది విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించకపోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్ది విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సర్ధార్ పాషా, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కూనూరు అశోక్ గౌడ్, తాడూరి రఘు, మాదరి రామయ్య, మాదరి చంద్రమౌళి, గడదాసు సునీల్ కుమార్, కాళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.
21న అథ్లెటిక్స్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగేంధర్‌రెడ్డి మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్‌ఎస్‌లో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9866564422, 9000354465 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.


