‘రోగులకు మెరుగైన వైద్యం అందించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘రోగులకు మెరుగైన వైద్యం అందించాలి’

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

కన్నాయిగూడెం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంతీయ కార్యాలయం (ఆర్‌ఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ)హైదరాబాద్‌ బృందం ప్రోగ్రాం అధికారి రవితేజ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమ బృందం సభ్యులతో కలిసి మంగళవారం సందర్శించారు. మారుమూల గ్రామాల్లో పేదలకు అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని రోగుల, అధికారుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. వాటి నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం చింతగూడెంలో పర్యటించి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం ప్రోగ్రామ్‌ ఆధికారి రవితేజ మాట్లాడుతూ ప్రజలు సీజనల్‌ వ్యాధులపై జాగ్రతగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. వర్షాకాలంలో వేడి చేసిన నీటిని తాగాలని వెల్లడించారు. అలాగే ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వకుండా చూసుకోవాలని ప్రోగ్రాం అధికారి రవితేజ సూచించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, అశోక్‌, వెంకటేశ్వర్లు, సిబ్బంది హెల్త్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌, భాస్కర్‌రావు, ఏఎన్‌ఎం ఊర్మిల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement