బాధితులకు సత్వర న్యాయం అందించాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ములుగు డీఎస్పీ రవీందర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని మేడారంలో గల నార్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లు, కేడీ నేరస్తుల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగంతో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించిన డీఎస్పీ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పస్రా సీఐ దయాకర్‌, ఎస్సై కమలాకర్‌ ఉన్నారు.

డీఎస్పీ రవీందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement