క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు బ్యాటరీ టెస్టులు | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు బ్యాటరీ టెస్టులు

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

ఏటూరునాగారం: మండల పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల క్రీడా పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు పొందటానికి అర్హులైన విద్యార్థులకు మంగళవారం పాఠశాల ఆవరణలో బ్యాటరీ టెస్టులను నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ రాజునాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ తరగతిలో ప్రవేశానికి 4వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోగా బ్యాటరీ టెస్టులకు 105 మంది హాజరయ్యారని తెలిపారు. వారికి వివిధ రకాల టెస్టులను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే 6 నుంచి 9వ తరగతిలో కూడా సీటు పొందేందుకు దేహదారుఢ్య, నైపుణ్య పరీక్షలను నిర్వహించి గెలుపొందిన వారికి సీటును ఇస్తామని వివరించారు. రెండు రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడలపై ఆసక్తి, చదువుపై శ్రద్ధ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

తొలిరోజు 105 మంది హాజరు

ప్రిన్సిపాల్‌ రాజునాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement