సీతక్కపై ఆరోపణలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

సీతక్కపై ఆరోపణలు సరికాదు

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌

ములుగు: మంత్రి సీతక్కపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సాధన ఉద్యమంలో నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి కలిసికట్టుగా పోరాడి జిల్లా సాధించుకున్నామన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వారు ఇప్పుడు మంత్రి సీతక్క, కుమారస్వామిపై ఆరోపణలు చేయడం సబబుకాదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకులు రాజేందర్‌గౌడ్‌, రవి యాదవ్‌, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement