ములుగు రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ పేర్కొన్నారు. సోమవారం చైతన్య బస్సుయాత్ర జిల్లా కేంద్రానికి చేరుకోగా జిల్లా అధ్యక్షుడు గుండబోయిన రవిగౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా రూ.20 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు. ఏజెన్సీల్లో రద్దు చేసిన సొసైటీలను పునరుద్ధరించాలని అన్నారు. జిల్లా కేంద్రంలో సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు, కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కుమార్, శ్రీనివాస్, మధుకర్, నర్సయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ


