● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం
ములుగు రూరల్ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియాగాంధీ అంతరాయం కలిగించినందుకు దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశభక్తి, జాతీయ గౌరవం, వందేమాతర గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. జాతీయ గీతం విషయంలో రాజకీయ భేదాలకు అతీతంగా గౌరవం, క్రమశిక్షణ పాటించవలసిన బాధ్యత దేశ పౌరులపై ఉందని తెలిపారు. జాతీయ జెండా విషయంలో బీజేపీపై ఆరోపణలు చేసిన మంత్రి సీతక్క కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ములుగు జిల్లా ఏర్పాటు ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీ కృషి కాదని సమష్టి ప్రజల కృషి ఫలితమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, భూక్య జవహర్‌లాల్, దేవేందర్‌రావు, రవీంద్రాచారి, నగరపు రమేష్, కృష్ణాకర్, రామరాజు, సుమలత, నాగరాజు, రాకేష్‌యాదవ్, మహేందర్, సతీష్, నరేందర్, కుమార్, రవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


