ప్రజావాణి వినతులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి వినతులు పరిష్కరించాలి

Aug 18 2026 7:22 AM | Updated on Aug 18 2026 7:22 AM

ములుగు : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో 28 దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు–3, ఇందిరమ్మ ఇళ్లు–5, పెన్షన్‌–7, ఇతర శాఖలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు, డిప్యూటీ ట్రెయినింగ్‌ కలెక్టర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మండల స్థాయి ప్రజావాణికి విశేష స్పందన

జిల్లాలోని పది మండలాల్లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేవిధంగా ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 219 మంది అధికారులు పాల్గొనగా ప్రజల నుంచి 180 దరఖాస్తులు స్వీకరించారని పేర్కొన్నారు. ఏటూరునాగారంలో 24, గోవిందరావుపేట–14, కన్నాయిగూడెం–3, మల్లంపల్లి–32, మంగపేట–42, ములుగు–14, తాడ్వాయి–10, వెంకటాపురం(ఎం)–25, వెంకటాపురం(కె)–12, వాజేడులో 4 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు మండలస్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలని కోరారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement