సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరిస్తాం

Aug 18 2026 7:22 AM | Updated on Aug 18 2026 7:22 AM

ఏటూరునాగారం : గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని ఐటీడీఏ పీఓ లెనిన్‌వత్సల్‌ టొప్పో పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పీఓ గిరిజనుల నుంచి 25 వినతులు స్వీకరించారు. వెంకటాపురం(కె) మండలంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో మూడేళ్లుగా ఆఫీస్‌ సబార్డినేట్‌గా (అటెండర్‌) పనిచేస్తున్నామని, క్యాటరింగ్‌, శానిటేషన్‌ డబ్బులు సగం జీతం వస్తుందని, వేతనం ఇప్పించాలని గిరిజనుడు కోరారు. మహబూబాబాద్‌ జిల్లా నుంచి కాంటింజెంట్‌ వర్కర్‌గా పనిచేస్తున్న తనకు కాలు విరిగిందని, తన పోస్టును కోడలికి ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురంలో తుడుందెబ్బ స్టడీ సెంటర్‌ బుక్స్‌, కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. ఐటీడీఏ పాఠశాలలోని స్కావెంజర్లకు వేతనాలు ఇప్పించాలని గిరిజనులు ఏఐటీయూసీ నాయకుడు జంపాల రవీందర్‌ కోరారు. వినతులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ ప్రతాప్‌, డీడీ జనార్దన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, జేడీఎం కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ లెనిన్‌వత్సల్‌ టొప్పొ

గిరిజన దర్బార్‌లో 25 వినతుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement