గిరిజన టైలరింగ్‌ హబ్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజన టైలరింగ్‌ హబ్‌

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

24 కుట్టు మిషన్లతో

శిక్షణ కేంద్రం

పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సభకు హాజరైన ప్రజలు

ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజన మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఐటీడీఏ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాం స్వయంగా కుట్టి ఇచ్చేందుకు నిరుద్యోగ మహిళలతో నూతనంగా టైలరింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఐటీడీఏ సమీపంలోని నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో ప్రత్యేక వసతులతో ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. సుమారు రూ.16 లక్షల బడ్జెట్‌తో 24 కుట్టు మిషన్లు, కాజాలు, బటన్స్‌ కుట్టే మిషన్లను తీసుకొచ్చారు. షెడ్డు ఏర్పాటుకు రూ. 6.50 లక్షలు కేటాయించగా మిషనరీ, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.9.50 లక్షలు కేటాయించారు. వీటితో పాటు ప్రత్యేక కార్పేట్‌, ఫ్యాన్లు, లైటింగ్‌ సిస్టమ్‌తో పాటు విద్యుత్‌ మోటార్లను సైతం అమర్చుతున్నారు.

హబ్‌ ప్రారంభానికి ఏర్పాట్లు

గతంలో ఐటీడీఏ పరిధిలో సుమారు 4 వేల మంది విద్యార్థులకు వివిధ గ్రామాల్లోని మహిళా సంఘాల్లో గల టైలరింగ్‌ నేర్చుకున్న మహిళలకు నూతన దుస్తులు కుట్టే కాంట్రాక్ట్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం అలా కాకుండా ఐటీడీఏ ద్వారానే ప్రత్యేక టైలరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో నైపుణ్యం గల మహిళలను కేటాయించి ఈ మిషనరీలతో చౌకగా కుట్టి ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించనున్నారు. దీనివల్ల సమయం, ఖర్చు కూడా తక్కువ కానుండడంతో పాటు గిరిజన మహిళలకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ హబ్‌ను జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టింది. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన పీఓ చిత్రామిశ్రా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించారు. దాంతో ఈ పనులు శరవేగంగా ముందుకుసాగుతున్నాయి. దాదాపుగా మిషనరీ ఫిట్టింగ్‌ పూర్తికాగా చిన్నచిన్న పనులు కొనసాగుతున్నాయి. ఈ హబ్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడపనున్నారు.

ప్రైవేట్‌ మార్కెటింగ్‌పై నజర్‌

ఈ హబ్‌లో శిక్షణతో పాటు ప్రభుత్వ ఆమోదిత కాంట్రాక్టుతో డ్రెస్‌లను తయారు చేయించనున్నారు. ఈ హబ్‌ ద్వారా ప్రైవేట్‌ మార్కెటింగ్‌ చేసుకునే వెసులుబాటును సైతం కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్‌ రంగంలో రకరకాల డ్రెస్‌లు కుట్టి విక్రయిస్తే మహిళలు మరింత ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. దీంతో నిత్యం డ్రెస్‌లు కుట్టడంతో పాటు మార్కెటింగ్‌ చేసేందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. తక్కువ ధరలకే నాణ్యమైన డ్రెస్‌లు సైతం అందుబాటులోకి రానున్నాయి.

బటన్స్‌, కాజాల స్టిచ్చింగ్‌

రూ. 16 లక్షల నిధులు

కేటాయించిన ఐటీడీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement