పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు, శ్రావణ మాసం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఈశ్వర్‌చంద్‌శర్మ, అనిపెద్ది రాజీవ్‌ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తజనంతో సందడి నెలకొంది.

హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement