ఐక్యత భావమే..దేశానికి రక్షణ | - | Sakshi
Sakshi News home page

ఐక్యత భావమే..దేశానికి రక్షణ

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా..

భూపాలపల్లి రూరల్‌: ఐక్యత భావమే.. దేశానికి రక్షణ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా.. ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. దేశం ఐక్యంగా ఉంటే భారతదేశాన్ని ప్రపంచంలో ఎవరు కూడా ఓడించలేరన్నారు. ప్రతిఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి, కౌన్సిలర్‌ యుగేందర్‌, పార్టీ నాయకులు, యువకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement