ఆశ్రమ పాఠశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాల తనిఖీ

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మండల పరిధిలోని ఊరట్టం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో తనిఖీ చేశారు. పాఠశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలించి విద్యార్థులకు స్పార్క్‌ ట్రైనింగ్‌పై అందుతున్న శిక్షణ వివరాలను ఇన్‌స్ట్రక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైన్స్‌ ల్యాబ్‌, లైబ్రరీ, రీడింగ్‌ హాల్‌ను పరిశీలించి విద్యార్థుల వినియోగంపై ఆరా తీశారు. స్కూల్‌ లెడ్‌ క్లబ్‌లు నిరంతరం నిర్వహించాలని, డిజిటల్‌ బ్లాక్‌ బోర్డులను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి అన్ని సబ్జెక్టుల్లో పట్టుసాధించి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్‌, డిప్యూటీ వార్డెన్‌ అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement