మేడారం జాతరలో విధులు నిర్వర్తించిన వారికి రికార్డుల మేరకు డబ్బులను చెల్లిస్తున్నాం. నాలుగు రోజులు మాత్రమే విధుల్లో ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఆరు రోజులు విధులు చేపట్టినట్లు తెలుపగా జాతర సమయంలో విధుల్లో ఉన్న అధికారులను ఫోన్‌లో సంప్రదించి విషయం తెలుసుకున్నాను. వారు 5 రోజులు విధుల్లో ఉన్నారని తెలుపగా డబ్బులు చెల్లిస్తున్నాం. ఆరు రోజులు విధుల్లో ఉన్నట్లు నిర్ధారణ అయితే తిరిగి డబ్బులు చెల్లిస్తాం.
ఆరు రోజుల వేతనం చెల్లించాలి
మేడారం జాతరలో గజ ఈతగాళ్లు ఆరు రోజుల పాటు విధులు నిర్వర్తించారు. ఐదు రోజులకు మాత్రమే డబ్బులు చెల్లించడంతో నష్టపోతున్నారు. గతంలో విధులు నిర్వర్తించిన ఎఫ్‌ఎఫ్‌ఓ హాజరు మస్టర్‌లలో సంతకాలను ఐదు రోజులకు మాత్రమే తీసుకున్నారు. జాతర అనంతరం సుమారు 25 మంది వరకు తిరుగు వారం వరకు విధులు నిర్వర్తించారు. అందుకు సంబంధించిన డబ్బులను సైతం అందించాలి.
●
– సాద శంకర్,
మత్స్యశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు
– రజిని,
జిల్లా మత్స్యశాఖ ఇన్‌చార్జ్ అధికారి


