శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి

Aug 13 2026 1:03 AM | Updated on Aug 13 2026 1:03 AM

రేగొండ: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి, వారికి సైన్స్‌పై ఆసక్తి పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్‌ అధికారి స్వామి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, ఇన్‌స్పైర్‌ అవార్డు ఆన్‌లైన్‌, ఖాన్‌ అకాడమీ బుక్‌ ఆఫ్‌ డిజిటల్‌ లర్నింగ్‌ తదితర అంశాలపై ఒక రోజు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పరిశోధన విధానాన్ని పెంపొందించాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎన్నుకుని విద్యార్థులచే ప్రాజెక్ట్‌ తయారు చేయించి జిల్లా స్థాయి నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దేవేందర్‌, ఆర్పీలు ప్రవీణ్‌, సుమన్‌, సైన్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎంజీఎంలో

వైద్యసేవలపై కలెక్టర్‌ ఆరా

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని బుధవారం కలెక్టర్‌ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలు, మీడియాలో వచ్చిన కథనాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముందుగా.. ఆమె ఎంఏసీ, క్యాజువాలిటీతోపాటు డైట్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంఏసీ వద్ద ఓ రోగి బయట పడుకున్నట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన దాని గురించి అడిగి అధికారులనుంచి వివరణ తీసుకున్నారు. ఓ సెక్యూరిటీ గార్డు డబ్బులు తీసుకుంటున్నట్లు వచ్చిన మీడియా కథనంపై ఆరా తీశారు. తమ పేషెంట్‌ను ఎంఏసీ వార్డులో అడ్మిట్‌ చేసుకోవడం లేదని, తమ యూనిట్‌ కాదని చెబుతున్నారని రోగి బంధువులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. క్యాజువాలిటీకి వెళ్లి వైద్య సేవల విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని డ్యూటీ డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేషెంట్‌ అటెండెంట్‌ కలెక్టర్‌కు తమ సమస్యలు విన్నవించారు. దీంతో ఆమె వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులకు అందుతున్న వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని కంప్లైంట్‌ బాక్స్‌ పరిశీలించారు. అనంతరం రోగులకు ఆహారాన్ని అందించే డైట్‌ను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. అంతకుముందు అకడమిక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్‌ రాంకుమార్‌రెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ అశ్విని, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ దయాశీల, పలువురు వైద్యులు ఉన్నారు.

రోగులకు పరీక్షే

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో సాధారణంగా చేయించుకునే బ్లడ్‌ గ్రూపింగ్‌ టెస్ట్‌ లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యసవర విభాగంతో పాటు సెంట్రల్‌ ల్యాబ్‌లో కూడా ఈ పరీక్ష అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సర్జరీ చేయాలన్నా, రక్తం ఎక్కించాలన్నా బ్లడ్‌ గ్రూప్‌ తెలుసుకోవడం ముఖ్యం. ఈ గ్రూపు తెలుసుకోవడానికి అవసరమైన సిరాస్‌ లేకపోవడం వల్ల టెస్ట్‌లు చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పేషెంట్‌ ఏ రక్త గ్రూపునకు సంబంధించిన వారో తెలుసుకోవడానికి యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ అందుబాటులో ఉండాలి. ఇందులో ఏమీ లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేట్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్‌గా తీసుకొచ్చిన బ్లడ్‌ గ్రూప్‌ రిపోర్ట్‌ను వైద్యులు అంగీకరించడం లేదని పేషెంట్లు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా సర్జరీ చేయాలంటే బ్లడ్‌ గ్రూప్‌ లేకుంటే సర్జరీలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఈ పరీక్షలపై ప్రత్యేక చొరవ చూపాలని, అడ్వాన్స్‌గా కెమికల్స్‌ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement