నర్సంపేట: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే.
మొక్కలు నాటి సంరక్షించాలి
ములుగు రూరల్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపాలిటీ కౌన్సిలర్ గండ్రకోట వాణి అన్నారు. ఈ మేరకు శనివారం గట్టమ్మ ఆలయ పరిసరాల్లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గట్టమ్మ ఆలయ పరిసరాలలో ఉన్న చెత్తా చెదారం తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆలయ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువతరం యూత్ అధ్యక్షుడు గునిశెట్టి సందీప్, రంజిత్, జితేందర్, రాఘవ, బన్నీ, నాగసాయి, రాంచరణ్, మహేందర్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలోని శిల్పకళ అద్భుతంగా ఉందని టీజీటీడీసీ జీఎం (ఫైనాన్స్) సునిత అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం కుటుంబ సమేతంగా రామప్పను సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా బాగుందని కొనియాడారు.
ఆదివాసీ దినోత్సవాన్ని
విజయవంతం చేయాలి
ములుగు రూరల్: నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పోడు దెబ్బ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ గాలి సమ్మయ్య కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీగూడెంలో ఆకుపచ్చ జెండా ఎగురవేయాలన్నారు. ఆదివాసీల హక్కులను, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని వెల్ల డించారు. జల్ జంగిల్ జమీన్ పరిరక్షణకు పోరాటం చేసిన వీరుల ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఆదివాసీలు హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారయ్య, యాదగిరి, కనకయ్య, ధనుంజయ్, రామారావు, రమేశ్, తిరుపతి పాల్గొన్నారు.
ఏఐసీసీ చీఫ్‌ను కలిసిన డాక్టర్ రామకృష్ణ
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా, పార్టీలో సీనియర్‌గా వరంగల్ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు.


