● జంపన్నవాగు వరదకు ఒర్లిపోతున్న మట్టి
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డు జంపన్నవాగు వరదకు కోతకు గురవుతోంది. జంపన్నవాగు వర్షాల కురిసిన సమయంలో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్డుకు వేసిన మట్టి మొత్తం ఒర్లిపోయి చెట్లు కూడా వరద నీటిలో కలిసి కొట్టుకుపోతున్నాయి. వరద మరింత ఎక్కువైతే ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కోతకు గురై కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి ఒర్లిపోతున్న రోడ్డుకు రాయితో రివిట్‌మెంట్ చేయించాలని మాజీ సర్పంచ్ చెరుకుల గోపి కోరారు.


