ఉప్పొంగుతున్న వాగులు | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగుతున్న వాగులు

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

కన్నాయిగూడెం: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఏజెన్సీలోని పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐలాపూర్‌ చుట్టూ ఉన్న వాగులు ఉప్పొంగడంతో గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పాటు కంతనపల్లి గ్రామ పరిధిలోని దొంగలగుట్ట వాగు పొంగి పొర్లడంతో తుపాకులగూడెం, ఏటూరునాగారం ప్రధాన రహదారిపై లోలెవల్‌ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గిన తర్వాత రాకపోకలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement