మత్తుపదార్థాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మత్తుపదార్థాలపై అవగాహన కల్పించాలి

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

మత్తుపదార్థాలపై అవగాహన కల్పించాలి

ములుగు: మత్తుపదార్థాలతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నార్కోటిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజానికి శాపంగా మారిన మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యువత, విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా పోలీస్‌, ఎకై ్సజ్‌, విద్యాశాఖలు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్‌ విక్రయాలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, గ్రామ, మండల స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ములుగు సామాజిక ఆస్పత్రిలో ప్రత్యేకంగా డి అడిక్షన్‌ కేంద్రం అందుబాటులో ఉందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రత్యేక వైద్య నిపుణులతో సైకాలజిస్ట్‌లతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్‌, జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఏఓ సురేశ్‌కుమార్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు మహేశ్‌బాబు, ఎకై ్సజ్‌ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ

Advertisement
 
Advertisement
Advertisement