ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు: జిల్లా ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీపై వెళ్లగా, అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న సుధీర్ రాంనాథ్ కేకన్‌ను జిల్లా ఎస్పీగా నియమించింది. గతంలో 2020 నుంచి 2022 వరకు ములుగు ఏఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్ పనిచేశారు.
ఏఎస్పీగా మానన్‌భట్
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఏఎస్పీగా మానన్ భట్‌ను నియమిస్తూ డీజీపీ జితేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మానన్ భట్ గ్రేహౌండ్స్‌లో పనిచేస్తుండగా ఏఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఎస్పీ శివం ఉపాధ్యాయను ములుగు ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్


