పౌష్టికాహారం అందించాలి
ములుగు రూరల్: విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలని డీసీడీఓ రమాదేవి అన్నారు. మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, బండారుపల్లి మోడల్ పాఠశాలలను ఆమె సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని వివరించారు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలోని సమస్యలను తమకు తెలియజేయాలన్నారు. బోధన సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆమె వెంట కేజీబీవీ ఎస్‌ఓ జీవనప్రియ, సిబ్బంది ఉన్నారు.
గ్రూప్స్ విజేతలకు సన్మానం
ఎస్‌ఎస్ తాడ్వాయి: ఇటీవల విడుదలైన గ్రూప్స్‌లో విజయం సాధించి ఉద్యోగాలకు ఎంపికై న మండల పరిధిలోని కాటాపూర్‌కు చెందిన బెల్లంకొండ నవీన్, సెంట్రల్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కరుణాకర్ గ్రూప్ 2లో ర్యాంకు సాధించి ప్రస్తుతం జూనియర్ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. సోమవారం వీరిని బతుకమ్మ కమిటీ సభ్యులు గ్రూప్స్ విజేతలతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాటాపూర్‌కు చెందిన నవీన్, కరుణాకర్ ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. వారి విజయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
కారు పల్టీ..
ముగ్గురికి గాయాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా గుండ్లవాగు కార్నర్ సమీపంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సత్తేంద్ర వరంగల్ వైపునకు కారులో వస్తుండగా వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు కింద పడిపోయింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సిబ్బంది గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని సింగరేణి పాఠశాలల్లో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్ రాసే విద్యార్థుల కోసం ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను ఈ నెల 10వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు.
పౌష్టికాహారం అందించాలి
పౌష్టికాహారం అందించాలి


