ఇప్పపువ్వు సేకరణపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఇప్పపువ్వు సేకరణపై అవగాహన

Apr 5 2025 1:24 AM | Updated on Apr 5 2025 1:24 AM

ఇప్పపువ్వు సేకరణపై అవగాహన

ఇప్పపువ్వు సేకరణపై అవగాహన

వెంకటాపురం(ఎం): ఇప్పపువ్వు సేకరణపై మండలంలోని బండ్లపహాడ్‌, ఊట్ల గొత్తికోయ గ్రామాల్లో గిరిజనులకు అటవీశాఖ అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ములుగు ఎఫ్‌ఆర్‌ఓ శంకర్‌ మాట్లాడుతూ.. ఇప్పపూవ్వు సేకరణ సమయంలో ఇప్పచెట్ల కింద క్లీనింగ్‌ కోసం నిప్పు పెట్టవద్దని, గ్రీన్‌ షాడో నెట్లను ఉపయోగించాలన్నారు. ఇప్పచెట్ల కింద ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఇతర చెట్లు కాలిపోయే ప్రమాదముంటుందన్నారు. ఇప్పచెట్ల కింద చెత్తను తొలగించి గ్రీన్‌నెట్లను వాడుతున్నవారికి అటవీశాఖ తరఫున బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ యాకూబ్‌ జానీ, ఎఫ్‌ఎస్‌ఓ రాజేశ్వరి, ఎఫ్‌బీఓలు రజిత, స్వర్ణలత, రూప్‌కుమార్‌, బేస్‌ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement