మతసామరస్యానికి ప్రతీక రంజాన్
రేగొండ: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని భాగిర్థిపేట మజీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని మతాలు ఒకటేనని ప్రజలంతా సోదర భావంతో ఉండాలన్నారు. మజీద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాయినేని సంపత్‌రావు, పున్నం రవి, పట్టెం శంకర్, షాబీర్ అలీ, మైస భిక్షపతి, క్రాంతి, ముదురుకొల్ల తరుణ్, పున్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని జామా మసీదులో కాంగ్రెస్‌పార్టీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు లేతకరి రాజబాపు ఆధ్వర్యంలో ముస్లింలకు ఆదివారం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. అంతకు ముందు ముస్లింలు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మతపెద్దలను శాలువాలతో సన్మానించారు. సమద్, షేక్ జానీ, ఇక్భాల్, మక్సూద్,అమీన్, శకీల్‌లతో పాటు నాయకులు పవన్‌శర్మ, మంగాయి లక్ష్మణ్, శంకరయ్య, ఫరీద్, హైదర్, అరుణ్, సంతోష్, సంతు, రాజబాపు,నగేష్, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
మతసామరస్యానికి ప్రతీక రంజాన్


