మలుగు: ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడిపిన వారికి జిల్లా కోర్టు సివిల్ జడ్జి కన్నయ్యలాల్ వినూత్నంగా జరిమానా వేశారు. సుమారు నాలుగు గంటలపాటు సమాజ సేవ చేయాలని ఆదేశించారు. ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్‌లో ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోఉన్న ప్లాిస్టిక్ కవర్లు, చెత్తా చెదారం, పిచ్చి మొక్కల తొలగింపు పనులను చేయించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తాగి వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడొద్దని సూచించారు.
చట్టాలపై అవగాహన ఉండాలి
టేకుమట్ల: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ హెల్ఫ్‌లైన్ జిల్లా అధికారి కళావతి అన్నారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్(టి) అంగన్‌వాడీ కేంద్రంలో మహిళలకు చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం సుకన్య సమృద్ధియోజన, బేటీ బచావో–బేటీ పడావో, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్‌లైన్, సఖి కేంద్రాలను నిర్వహింస్తుందని అన్నారు. బాలికల చదువు అనంతరం వివాహానికి సుకన్య సమృద్ధి యోజన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. బాలికలే భవిష్యత్‌కు పునాదులుగా బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు. బాలికలు సమాజంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇబ్బందులకు గురయితే చైల్డ్ హెల్ప్‌లైన్ తోడ్పాటునందిస్తుందన్నారు. మహిళలు కుటుంబ పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సఖి కేంద్రం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. చైల్డ్ హెల్ప్‌లైన్, బాలికల సమస్యల కోసం 1098, వృద్ధుల సమస్యల కోసం 14567, మహిళల సమస్యల కోసం 181 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరోజన, సఖి గాయత్రి మిషన్ శక్తి కో ఆర్డినేటర్ అనూష, మమత, అంగన్‌వాడీ టీచర్లు స్వరూప, వనిత, నిర్మల, విమల పాల్గొన్నారు.
సోలార్‌తో రైతులకు ఆదాయం
భూపాలపల్లి రూరల్: సోలార్ ఏర్పాటు చేసుకోవడం వలన రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతుందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఉర్జ సురక్ష ఈవం ఉత్తన్ మహా అభియాన్) పథకం కింద కలెక్టరేట్‌లో శనివారం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం దరఖాస్తు చేసుకున్న భూపాలపల్లి, ములుగు జిల్లా రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకం వివరాలు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో 115, ములుగు జిల్లాలో 49 దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఒక మెగావాట్ ప్లాంట్‌కు సంవత్సరంలో సుమారు రూ.57లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు, భూపాలపల్లి ఎస్‌ఈ మల్చూర్ నాయక్, టీజీ రెడ్కో డీఎం హైదరాబాద్ పండారి, డివిజనల్ ఇంజనీర్ భూపాలపల్లి పాపిరెడ్డి, ములుగు డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు, డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ భూపాలపల్లి వెంకటేశం పాల్గొన్నారు.
మద్యపాన ప్రియులతో సమాజ సేవ
మద్యపాన ప్రియులతో సమాజ సేవ