
యువికా చౌదరి (Yuvika Chaudhary).. మొదట్లో హీరోయిన్‌గా సినిమాలు చేసింది. తర్వాత సహాయనటిగా యాక్ట్ చేసింది. హిందీతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్‌లోనూ పాల్గొంది. ఈ షోలోనే నటుడు ప్రిన్స్ నరూలాతో ప్రేమలో పడింది. షో తర్వాత కూడా వీరిద్దరూ ఆ ప్రేమను కొనసాగించారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా 2024లో కూతురికి జన్మనిచ్చారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో యువికా తల్లింట్లోనే ఉంది. దీంతో యువికా- ప్రిన్స్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది.
నా మనసంతా అదే
ఈ ప్రచారం గురించి ఇన్నాళ్లకు పెదవి విప్పింది యువికా చౌదరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను గర్భం దాల్చినప్పుడు నా మెదడులో, మనసులో పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను. పనికిరాని రూమర్లకు ప్రాధాన్యత ఇవ్వకూడదనుకున్నాను. అందుకే వాటిని లైట్ తీసుకున్నాను. ఈ పుకార్లు లైఫ్‌లో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నా ప్రెగ్నెన్సీ ఎప్పుడంటే అప్పుడు రాదుగా.. అందుకే రూమర్స్‌ను పట్టించుకోలేదు. ఒకవేళ క్లారిటీ ఇచ్చినప్పటికీ పరిస్థితి చక్కబడటం కాదుకదా.. దాన్ని మరింత రచ్చ చేస్తారని భావించాను.
మా మధ్య మనస్పర్థలు నిజమే
అయినా మౌనంగా ఉన్నా కూడా దాన్ని ఇంకా సాగదీశారు. ఏదేమైనా నాకు నా బిడ్డే ముఖ్యం. తనను నేను బాగా చూసుకోవాలి. తనకోసం మరింత స్ట్రాంగ్‌గా నిలబడాలి.. ఇవే నా మనసులో మెదిలేవి. నిజానికి ప్రిన్స్ నాకెంతో సపోర్ట్ చేస్తాడు. కాకపోతే అందరిలాగే మా మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. లైఫ్‌లో ఇది కూడా ఓ ఫేజ్ అని, అదెంతో కాలం ఉండదని నాకు బాగా తెలుసు. ప్రెగ్నెన్సీలో సడన్‌గా సంతోషంగా ఉంటాం. అంతలోనే బాధగా అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మనపక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ మా ఇంట్లో ఇంటీరియర్ పనులు జరుగుతుండటంతో ప్రిన్స్ అవన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.
తల్లికంటే ఎక్కువ ఎవరు చూసుకోగలరు?
మరోవైపు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో నేను మా అమ్మ దగ్గర ఉండటమే మంచిదని భావించాడు. తల్లికంటే బాగా ఎవరూ చూసుకోలేరని పుట్టింటికి పంపించాడు. ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మానాన్నతో కలిసి ఉండటం పాపమేమీ కాదు, అదందరూ చేసేదే! అది అర్థం చేసుకోలేనివాళ్లు పిచ్చి పుకార్లు సృష్టించారు. కానీ ప్రిన్స్ మా విడాకుల రూమర్స్ విని బాధపడ్డాడు. నేను పుట్టింట్లో.. తనేమో నాకు దూరంగా ఉండేవాడు. ఏదేమైనా ఆ ఫేజ్ దాటేశాం. హ్యాపీగా ఉన్నాం అని యువికా చౌదరి చెప్పుకొచ్చింది.
చదవండి: కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్