వర్మా వర్మా వర్మా.. ఓ రాంగ్‌ గోపాల్‌ వర్మ | Sakshi
Sakshi News home page

ఏమిటయ్యా మా ఖర్మ

Published Thu, Aug 27 2020 6:53 AM

Wrong Gopal Varma poster release - Sakshi

ప్రముఖ సినీ జర్నలిస్ట్‌ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్‌ గోపాల్‌ వర్మ’. కమెడియన్‌ ‘షకలక’ శంకర్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ సినిమా పోస్టర్‌ను మహిళాభ్యుదయవాది సంధ్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘మహిళల పట్ల చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టల్ని ఎండగడుతూ ప్రభు రూపొందించిన ‘రాంగ్‌ గోపాల్‌ వర్మ’ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను’ అన్నారు. ‘ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయిన నేను ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం నేను రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్‌ గోపాల్‌ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ..’ అనే పాటను త్వరలో విడుదల చేస్తాం’ అని ప్రభు తెలిపారు. (రాంగ్ గోపాల్‌ వర్మ) 

Advertisement
 
Advertisement