పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న హన్సిక?

Will Hansika Quit Acting Post Wedding With Sohael Khaturiya - Sakshi

'దేశ ముదురు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న హన్సిక ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది.

ప్రియుడు సోహెల్‌ ఖతురియాతో వచ్చే నెలలోనే ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన హన్సిక కాబోయే భర్తతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత హన్సిక నటనకు గుడ్‌బై చెప్పనుందా లేదా కంటిన్యూ చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన హన్సిక పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ కంటిన్యూ చేస్తానని స్పష్టం చేసింది. పని చాలా విలువైనదని, వివాహం తర్వాత కూడా హీరోయిన్‌గా కొనసాగుతానని పేర్కొంది. హన్సిక చివరగా  ‘మహా’అనే చిత్రంలో నటించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top