ఆపరేషన్‌ సిందూర్‌ ఘటన ఆధారంగా సినిమా | Vivek Agnihotri and Bhushan Kumar announce Operation Sindoor | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌ ఘటన ఆధారంగా సినిమా

Mar 27 2026 3:29 AM | Updated on Mar 27 2026 11:56 AM

Vivek Agnihotri and Bhushan Kumar announce Operation Sindoor

కశ్మీర్‌లోని పహల్గాంలో గత ఏడాది మేలో జరిగిన ఉగ్రదాడికి ప్రతి స్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. హిందీలో ‘ది తాష్కెంట్‌ ఫైల్స్, ది కశ్మీరీ ఫైల్స్, ది వ్యాక్సిన్‌ వార్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 

టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్నారు. రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజేఎస్‌ టైనీ థిల్లాన్‌ రాసిన ‘ఆపరేషన్‌ సిందూర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ఇండియాస్‌ డీప్‌ స్ట్రైక్స్‌ ఇన్‌సైడ్‌ పాకిస్తాన్‌’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా గురించి వివేక్‌ అగ్నిహోత్రి మాట్లాడుతూ– ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే కథలను ప్రేక్షకులకు అందించడం పట్ల నాకు ఎక్కువ ఆసక్తి.

ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. సినిమాటిక్‌ మ్యాజిక్‌ కూడా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో కలిసి విస్తృత స్థాయిలో పరిశోధన చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. నిజాన్ని ఆవిష్కరించడం వంటిది’’ అని అన్నారు భూషణ్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement