చీర, హై హిల్స్ వేసుకొని ఫైట్ చేశా: విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Talk About Laila Movie | Sakshi
Sakshi News home page

చీర, హై హిల్స్ వేసుకొని ఫైట్ చేశా: విశ్వక్‌ సేన్‌

Feb 12 2025 1:29 PM | Updated on Feb 12 2025 1:42 PM

Vishwak Sen Talk About Laila Movie

‘ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలురాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ‘లైలా’ చేయడం జరిగింది’ అని అన్నారు హీరో విశ్వక్‌ సేన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లైలా’. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

తొలిసారి ఈ సినిమా కోసం లేడీ గెటప్‌ వేశాడు. మెకప్‌కే దాదాపు రెండున్నర గంటల సమయం పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు.చాలా నేచురల్ గా వచ్చింది. 

లైలా క్యారెక్టర్ లో ఫైట్ కూడా చేశాను. చీర, హై హిల్స్ లో ఫైట్ ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. దాన్ని ఒక స్టైల్ లో చేసాము. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

లైలా పాత్రతో పాటు సోను మోడల్‌ క్యారెక్టర్‌ కూడా అందరికి నచ్చుతుంది.  పబ్లిసిటీలో లైలా డామినేట్ చేస్తుంది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం సోను క్యారెక్టర్ ని కూడా చాలా ఇష్టపడతారు. ఫస్ట్ హాఫ్ లో సోను మోడల్ లైఫ్ స్టైల్ ని తన క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.

డైరెక్టర్‌ కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూదని అనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్ గానే వింటాను. కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఇది అడల్ట్ సినిమా కాదు. యూత్ ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కించాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.

ఈ సినిమాకి లిరిక్స్ రాశాను.‘మొహమాటం ఏమీ లేదు. నేను రాస్తాను. బాగుంటే పెట్టుకోండి ’అని డైరెక్టర్ తో చెప్పాను.ఆయనకిపెట్టడం జరిగింది. నాకు రాయడం ఇష్టం.

లైలా గెటప్ లో నన్ను చూసి ఇంట్లో వాళ్లు  చాలా ఎంజాయ్ చేశారు. నవ్వులు వెక్కిరింతలు అన్నీ జరిగాయి. మా అక్క మమ్మీ మ్యాచింగ్ చీరలు కట్టుకొని షూటింగ్‌కి వచ్చారు(నవ్వుతూ..)

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి గారు.. లైలాని చూడగానే నాకే కొరకాలనిపిస్తుందని' చెప్పడం  బెస్ట్ కాంప్లిమెంట్. లైలా నా కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా అవుందనే నమ్మకంతో చేశాను.

లైలాని బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. అయితే లైలా గెటప్ మళ్ళీ వెయ్యాలని ఉంది. ఇందులో సీక్వెల్ కి పనికొచ్చే మంచి క్లిప్ హ్యంగర్ సీన్ ఉంది. మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ వీక్ లో యాడ్ చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement