‘‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో సైదులు క్యారెక్టర్‌ని తరుణ్ భాస్కర్‌తో చేయించడానికి చాలా కష్టపడ్డాను. అయితే ఆ తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే తను నటుడిగా చాలా బిజీ అయిపోయాడు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ మూవీ స్టార్ట్ చేస్తారా? లేదా? అనే టెన్షన్ వచ్చింది. తను నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ కథ నాకు తెలుసు. ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లోనే చూసి, ఆదరించాలి’’ అని విశ్వక్ సేన్ కోరారు.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జోడీగా ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఎస్ ఒరిజినల్స్– మూవీ వెర్స్ స్టూడియోస్‌పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విశ్వక్ సేన్ అతిథిగా హాజరయ్యారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ–‘‘ఓం శాంతి శాంతి శాంతిః’ తప్పకుండా నవ్విస్తుందనే నమ్మకం ఉంది’’ అని చె΄్పారు. ‘‘చాలా నిజాయతీగా తీసిన సినిమా ఇది’’ అన్నారు ఏఆర్ సజీవ్. ‘‘అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది’’ అని సృజన్ యరబోలు, అనూప్ చంద్రశేఖరన్, వివేక్ కృష్ణని తెలిపారు.


