వైరల్‌ వీడియో: సోనూసూద్ తందూరి రోటీలు, తింటే మర్చిపోలేరు!

Viral Video: Sonu Sood Makes Tandoori Rotis At His Punjabi Dhaba - Sakshi

ముంబై: కరోనా కష్టకాలంలో మొదలైన సోనూసూద్‌ దాతృత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మందిని తమ సమస్యల నుంచి ఆదుకుని రియల్‌ హీరో అనిపించుకున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా అడిగిన వారికి లేదు, కాదు అనకుండా తనకు తోచిన సాయాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పలు వ్యాపారాలు కూడా మెదలు పెట్టాడు. అయితే ఈవేవి తన సొంత లాభం కోసం కాదు. కేవలం చిరు వ్యాపారులకు మద్దతివ్వడం కోసం నెట్టింట్లో చురుకుగా ప్రచారం  చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల సోనూసూద్‌ సూపర్‌ మార్కెట్‌ అని ఒకటి ఓపెన్‌ చేసి సైకిల్‌పై గుడ్లు, బ్రెండ్‌ వంటివి అమ్మాడు. దీనికి డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందని, ఇందుకు ఎక్స్‌ట్రా ఛార్జ్ అవుతుందని, త్వరగా ఆర్డర్ చెయ్యాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.

అలాంటి సోనూ కాగా తాజాగా పంజాబీ ధాబా ఓపెన్ చేసి అందులో స్వయంగా తందూరి రోటీలు చేసి అమ్ముతున్నాడు. సోనూ చేసిన రోటీలు తింటే మర్చిపోలేరని, ఒకసారి ఇక్కడ రోటీలు తిన్నవారు ఇక మళ్ళీ ఇంకెక్కడా తినలేరని కామెంట్‌ను జత చేసి ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే చిరు వ్యాపారులను ప్రొత్సహించేందుకు సోనూసూద్ ఇలా వారికి ఉచితంగా ప్రచారం చేస్తున్నాడు. సరసమైన ధరలకు ఇక్కడ పప్పు, రొట్టెలు లభించును అని క్యాషన్ పెట్టిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తుంది. కాగా చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని, వారు దేశానికి వెన్నుముకవంటి వారని సోనూసూద్‌ తెలిపాడు. చిన్న వ్యాపారాలు తమ రోజువారీ జీవనోపాధిని కొనసాగించలేకపోతున్నారని, వారిని ప్రోత్సహించే దిశగా తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top