Vinayakan-MeToo: మీటూపై అనుచిత వ్యాఖ్యలు, సారీ చెప్పిన నటుడు

Vinayakan Apologizes To Media Person Over Me Too Comments - Sakshi

తనకు పది మంది మహిళలతో శారీరక సంబంధం ఉందని, అదే మీటూ అయితే దాన్ని కొనసాగిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మలయాళ నటుడు వినాయకన్‌. ఒరుతె సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. మీటూపై అడ్డగోలుగా మాట్లాడినందుకు జర్నలిస్టులు అతడిని ఏకిపారేశారు.

ఈ పరిణామంతో వెనక్కు తగ్గిన వినాయకన్‌ సదర జర్నలిస్ట్‌కు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో నోట్‌ షేర్‌ చేశాడు. 'ఒరుతె ప్రమోషనల్‌ ఈవెంట్‌లో ఓ జర్నలిస్ట్‌ సిస్టర్‌ అవమానకరంగా భావించిన భాషను నేను ఉపయోగించాను. నేను ఆమెను ఏరకంగానూ టార్గెట్‌ చేయాలనుకోలేదు. ఆమెకు అసౌకర్యం కలిగించేలా మాట్లాడినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ వినాయకన్‌' అని రాసుకొచ్చాడు.

చదవండి: అదే ‘మీటూ’ అయితే, నేను దానిని కొనసాగిస్తాను

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top