బర్త్‌డేకి బహుమతి

Vijay Devarakonda Liger Video Released on her birth day - Sakshi

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ అభిమానులకు ఈ నెల 9 ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు విజయ్‌ దేవరకొండ బర్త్‌డే. ఈ సందర్భంగా అభిమానులకు ఓ ప్రత్యేకమైన బహుమతిని సిద్ధం చేయిస్తున్నారట విజయ్‌. ఆ రోజున విజయ్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘లైగర్‌’కి చెందిన ఓ స్పెషల్‌ వీడియో విడుదల కానుందనే టాక్‌ వినిపిస్తోంది.

ఒకవేళ వీడియో కుదరకపోతే ‘లైగర్‌’కి సంబంధించి ఏదొ ఒక అప్‌డేట్‌ అయినా వస్తుందనే ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చార్మి నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ‘లైగర్‌’ చిత్రీకరణ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడే అవకాశం  ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top