Venu ThottemPudi: క్రేజీ ఆఫర్‌.. మహేశ్‌-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు?

Is Venu Thottempudi Plays Key Role In Mahesh Babu and Trivikram SSMB28 Movie - Sakshi

దాదాపు పదేళ్ల గ్యాప్‌ అనంతరం రీఎంట్రీ ఇచ్చాడు నటుడు వేణు తొట్టెంపూడి. ‘స్వయంవరం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన వేణు తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత ‘చిరునవ్వు, హనుమాన్‌ జంక్షన్‌, పెళ్ళాం ఊరెళితే’ వంటి ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఇక వరుస ఆఫర్స్‌, హిట్స్‌తో దూసుకుపోయిన వేణును ఆ తర్వాత ఫ్లాప్‌లు వెంటాడాయి. ఇలా అడపదడప చిత్రాలు చేస్తూ వచ్చిన వేణు చివరిగా ‘రామాచారి వీడో పెద్దగూఢ’ చారి సినిమాతో తెరపై కనిపించాడు. ఈ సినిమా తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న వేణు రీసెంట్‌గా ‘రామారావు ఆన్‌డ్యూటీ’తో ప్రేక్షకులను పలకరించాడు.

చదవండి: సందడే సందడి.. ఈ వారం బోలెడన్ని సినిమాలు రిలీజ్‌!

ఇక సీఐ మురళి అనే పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఇప్పుడు వేణు మరో క్రేజీ ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌ బాబు సినిమాలో ఓ కీ రోల్‌ కోసం చిత్ర బృందం వేణుని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సర్కారు వారి పాట మూవీతో అలరించిన మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28(#SSMB28) అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందే ఈ సినిమా వచ్చే నెల సెట్స్‌పైకి రానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. 

చదవండి: హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్‌ సల్మాన్‌

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత కోసం త్రివిక్రమ్ వేణును ఎంపిక చేసినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వేణు-త్రివిక్రమ్‌లు స్వయంవరం చిత్రంతో ఒకేసారి వెండితెర ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరికి ఈ మూవీ తొలి చిత్రం కావడం విశేషం. ఈ సనిమాకు త్రివిక్రమ్‌ కథ, మాటలు అందించారు. అందులోని త్రివిక్రమ్ డైలాగ్స్ ఏ రేంజ్‌లో పేలాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వేణు నటించిన ‘చిరునవ్వుతో’ చిత్రానికి కూడా త్రివిక్రమే మాటలు రాశారు. ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఏకంగా వేణుకి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించే అవకాశం రావడం ఆసక్తిని సంతరించుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top