టాలీవుడ్‌లో‌ విషాదం: వేదం నటుడు నాగయ్య మృతి

Vedam Movie Actor Nagaiah Last Breath In Hyderabad - Sakshi

‘వేదం’ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌ముఖ నటుడు నాగ‌య్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు చెందిన నాగయ్య ‘వేదం’ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన తన నటన, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

దీంతో ఆయనకు తెలుగులో నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్‌ సార్‌, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్‌, విరంజితో పాటు పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇలా ఆయన దాదాపు 30 సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. కాగా ఇటీవల ఆయన భార్య అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందుల్లో నాగయ్యకు సీఎం కేసీఆర్‌, మా ఆసోసియేషన్‌ అండగా నిలిచింది. కాగా, నాగయ్య మృతిపై మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. 'వేదం' సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది మందిని కదిలించారన్నారు.

చదవండి: 
మోనాల్‌తో వీడియో కాల్‌, వైరల్‌గా మారిన అఖిల్‌ కామెంట్
రామ్‌ చరణ్‌ బర్త్‌డే: మెగాస్టార్‌ ఎమోషనల్‌ వీడియో‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top