అన్నయ్య కోసం 'బరి'లోకి దిగిన చెల్లెలు | Varun tej and niharika konidela movie announced | Sakshi
Sakshi News home page

అన్నతో నిహారిక కొణిదెల కొత్త సినిమా ప్రకటన

Mar 28 2026 9:02 AM | Updated on Mar 28 2026 10:25 AM

Varun tej and niharika konidela movie announced

టాలీవుడ్‌ హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి బరి అనే టైటిల్‌ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఆపై ‘బరి’ మూవీకి క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

‘కమిటీ కుర్రోళ్లు’ మూవీతో భారీ హిట్ అందుకున్న యంగ్‌ డైరెక్టర్‌  యదు వంశీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని నిహారిక అధికారికంగా ప్రకటించారు. నేడు పూజా కార్యక్రమం జరగనుంది. కుటుంబ బ్యానర్‌లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement